ప్రత్యేక అంబులెన్స్ లను ప్రారంభించిన సీపీ సజ్జనార్

  • మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్ లు
  • 13 అంబులెన్స్ లను ప్రారంభించిన సజ్జనార్
  • మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ లేదా ఈ-మెయిల్ కు సమాచారం ఇవ్వండి
లాక్ డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో 13 అంబులెన్స్ లను పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్, ప్రైవేట్ ఆసుపత్రుల వారి సౌజన్యంతో ఈ అంబులెన్స్ లు ప్రారంభించినట్లు తెలిపారు.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డయాలసిస్ పేషెంట్ల కోసం అంబులెన్స్ లను వినియోగిస్తున్నారని, డయాలసిస్ చేయించుకునేందుకు వెళ్లేందుకు అనుమతి కోరిన రోగుల ఇళ్ల వద్దకు కానిస్టేబుళ్లు వెళ్లి పాసులు అందజేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్లు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను సూచించారు. గర్భిణిలు, వృద్ధులు, ఇతర అత్యవసరాల నిమిత్తం వెళ్ల దలచినవారు కోవిడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9490617440, 9490617431 కు లేదా covidcontrol@gmail.com ను సంప్రదించాలని సూచించారు.




More Telugu News