భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 1,375 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 379 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ముఖ్యంగా ఫైనాన్స్, ఆటోమొబైల్స్ స్టాకులు భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,375 పాయింట్లు నష్టపోయి 28,440కి పడిపోయింది. నిఫ్టీ 379 పాయింట్లు కోల్పోయి 8,281కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (4.94%), నెస్లే ఇండియా (4.49%), యాక్సిస్ బ్యాంక్ (2.50%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.19%), టైటాన్ కంపెనీ (0.77%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-11.95%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-10.92%), టాటా స్టీల్ (-8.36%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-7.96%), ఐసీఐసీఐ బ్యాంక్ (-7.67%).


More Telugu News