ఇవాళ ఏపీలో రెండు కరోనా కేసులు... రెండూ తూర్పుగోదావరి జిల్లాలోనే!
- రాష్ట్రంలో 23కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
- త్వరలోనే మరికొందరికి కరోనా పరీక్షలు
- విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ కొనసాగింపు
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం మరింత తీవ్రమైంది. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడమే అందుకు కారణం. కాకినాడ, రాజమండ్రి పట్టణాల్లో ఈ కేసులను గుర్తించారు.
కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, రాజమండ్రిలో 72 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడ్డాడు. ఈ రెండు కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 23కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 649 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. త్వరలో మరికొందరికి పరీక్షలు నిర్వహించనున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 29,672 మంది రాగా, వారిలో 29,494 మంది వారి ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు.