పాకిస్థాన్ లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా భూతం

  • 1600కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
  • 17 మంది మరణం
  • దక్షిణాసియా దేశాల్లో పాక్ లోనే ఎక్కువ కేసులు
పొరుగుదేశం పాకిస్థాన్ లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1600కి చేరింది.  ఇప్పటివరకు 17 మంది మరణించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాసియా దేశాల్లోకెల్లా పాకిస్థాన్ లో కరోనా వేగంగా వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దక్షిణాసియా దేశాలన్నింటిలో పాక్ లోనే ఎక్కువ కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. పరిస్థితి ఇలా ఉన్నా గానీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించలేదు. పాక్ లోని కొన్ని ప్రాంతాల్లోనే లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా, పాకిస్థాన్ లోని అనేక ప్రావిన్స్ ల ప్రభుత్వాలు అక్కడి వాస్తవాలను కప్పిపుచ్చుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


More Telugu News