ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు అమర్ రాజా గ్రూప్ రూ.5 కోట్లు విరాళం
- ‘కరోనా’ కట్టడికి చేస్తున్న పోరాటానికి మద్దతు
- రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చిన అమర్ రాజా గ్రూప్
- ఓ ట్వీట్ ద్వారా తెలియజేసిన ఎంపీ గల్లా జయదేవ్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక పోరాటానికి అమర్ రాజా గ్రూప్స్ తమ వంతు విరాళాన్ని అందజేసింది. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఓ ట్వీట్ చేశారు. ‘కరోనా’ కట్టడికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అమర్ రాజా గ్రూప్ మద్దతుగా నిలుస్తూ రూ.5 కోట్ల చెక్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఈ గ్రూప్ సీఈఓ అందజేశారని తన పోస్ట్ లో పేర్కొన్నారు.