క్వారంటైన్ లో ఉంటున్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి: నారా లోకేశ్
- కరోనా నివారణలో భాగంగా ఏపీలోనూ క్వారంటైన్ కేంద్రాలు
- యువతులు ఫిర్యాదు చేస్తున్న వీడియోను ట్వీట్ చేసిన లోకేశ్
- సరైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఏపీలోనూ క్వారంటైన్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. అయితే, రాజమండ్రి అర్బన్, బొమ్మూరులో ఏపీ టిడ్కో నిర్మించిన అపార్ట్ మెంట్స్ లో నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని క్వారంటైన్ శిబిరంలో ఉన్నవాళ్లు చెబుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
క్వారంటైన్ శిబిరాల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించాలని, మంచి భోజనం అందించాలని కోరుతున్నానని తెలిపారు. అంతేకాదు, కొందరు యువతులు తమ క్వారంటైన్ అనుభవాలను వివరిస్తున్న వీడియోను కూడా లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.