కరోనా నేపథ్యంలో వాట్సాప్ కీలక నిర్ణయం.. స్టేటస్ వీడియో టైమ్ కుదింపు!
- స్టేటస్ వీడియో నిడివి 15 సెకన్లకు కుదింపు
- పొడవు పెరిగితే క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది
- కరోనా ప్రభావం ముగిసేంత వరకు ఇది అమల్లో ఉంటుంది
ఇండియా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రముఖ మెస్సేజింగ్ సంస్థ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేటస్ లో అప్ లోడ్ చేసే వీడియో నిడివిని 15 సెకండ్లకు కుదించింది. ఈ నేపథ్యంలో భారతీయ వినియోగదారులు తమ వీడియోలను 15 సెకన్లకు మించి వుంటే కనుక క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా వైరస్ ప్రభావం ముగిసేంత వరకు ఇది అమల్లో ఉండబోతోందని వాట్సాప్ ప్రకటించింది. మరోవైపు ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో వాట్సాప్ వీడియ్ కాల్స్ ఎక్కువయ్యాయని తెలిపారు. వాట్సాప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.