కరోనా కష్టాల్లో కూడా మారని పాకిస్థాన్.. హిందువులపై వివక్ష!
- పాకిస్థాన్ పై కరోనా పంజా
- ముస్లింలకు మాత్రమే అందుతున్న నిత్యావసర వస్తువులు
- హిందువులకు ఇవ్వమని తెగేసిచెబుతున్న అధికారులు
కరోనా దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. ఆర్థికంగా ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఆ దేశం... కరోనా కారణంగా బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే వందలాది మంది కరోనా బారిన పడ్డారు. అయితే, ఉన్నంతలో బాధితులను ఆదుకోవడానికి అక్కడి ప్రభుత్వం యత్నిస్తోంది. అయితే, ఈ పరిస్థితుల్లో కూడా అక్కడి హిందువులపై వివక్ష కొనసాగుతోంది. వారికి రేషన్ ఇవ్వడం లేదు. కరాచీలో నిత్యావసర వస్తువులను ముస్లింలకు అందిస్తూ, హిందువులకు ఇవ్వడం లేదు. ముస్లింలకు మాత్రమే రేషన్ అని అధికారులు తెగేసి చెబుతున్నారు. దీనిపై మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు.