ఏపీలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఎక్సైజ్ సీఐ.. సస్పెన్షన్ తో పాటు భారీ జరిమానా విధింపు
- మద్యాన్ని తరలిస్తున్న ఎక్సైజ్ సీఐ త్రినాథ్
- పట్టుకున్న అనపర్తి ఎమ్మెల్యే, స్థానికులు
- శాఖాపరమైన చర్యకు ఆదేశించామన్న డిప్యూటీ సీఎం
కరోనా లాక్ డౌన్ సమయంలో పోలీసు సిబ్బంది మొత్తం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వర్తిస్తున్నారు. అయితే కొందరి కారణంగా పోలీసులు ప్రదర్శిస్తున్న స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. తాజాగా, కారులో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఎక్సైజ్ సీఐ ఒకరు పట్టుబడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ మద్యాన్ని తరలిస్తుండగా కుతుకులూరులో అనపర్తి ఎమ్మెల్యేతో పాటు స్థానికులు ఆయనను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐ తీరుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రినాథ్ ను సస్పెండ్ చేయడమే కాక... రూ. 5 లక్షల జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు. అంతేకాదు, శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించినట్టు చెప్పారు. అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.