లాక్ డౌన్ పొడిగింపు వార్తలు నిరాధారమన్న కేంద్రం!
- ఏప్రిల్ 15తో ముగియనున్న లాక్ డౌన్
- కానీ పొడిగిస్తారని వార్తలు
- నిరాధారమన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి
కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15తో ముగియనున్న నేపథ్యంలో, ఆ తరువాత లాక్ డౌన్ ను మరిన్ని రోజుల పాటు పొడిగించనున్నారని వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఈ వార్తలు నిరాధారమైనవని ఈ ఉదయం కేంద్ర ప్రభుత్వ అధికారిక మీడియా విభాగం పీటీఐ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వెల్లడించింది.
"కొన్ని రూమర్లు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 21 రోజుల లాక్ డౌన్ ముగిసిన తరువాత దాన్ని పొడిగిస్తారనడం నిరాధారం. కేంద్ర కార్యదర్శులు సైతం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు" అని వివరణ ఇచ్చింది. కాగా, ఈ వార్తలు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ ను పొడిగించే ఎటువంటి ఆలోచనా కేంద్రం చేయడం లేదని అన్నారు.