'నిన్ను మిస్ అవుతున్నా' అంటూ గుత్తా జ్వాల మెసేజ్... స్పందించిన బాయ్ ఫ్రెండ్ విష్ణు!
- లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా బంద్
- హైదరాబాద్ లో జ్వాల, చెన్నైలో విష్ణు విశాల్
- సామాజిక దూరం పాటిద్దామని కూల్ చేసే ప్రయత్నం
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా విమానాలు సహా, అన్ని రకాల ప్రజా రవాణా నిలిచిపోగా, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. చాలా మంది తమ వారికి దూరంగా ఉన్నారు. ఈ జాబితాలో సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఉన్నారు. ఆమె తన బాయ్ ప్రెండ్, హీరో విష్ణు విశాల్ ను తెగ మిస్ అవుతోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో పేర్కొంది.
ప్రస్తుతం జ్వాల హైదరాబాద్ లో ఉండగా, విష్ణు విశాల్ చెన్నైలో ఉన్నాడు. ఇక జ్వాల ట్వీట్ ను చూసిన విష్ణు, "పర్లేదు... ప్రస్తుతానికి సామాజిక దూరం ముఖ్యం. అందరి ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం" అంటూ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కాగా, వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి ఫొటోలు ఆమధ్య నెట్టింట్లో వైరల్ అయ్యాయి కూడా.