హైదరాబాద్ లో కల్లు లేక పిచ్చి ప్రవర్తన... ఎర్రగడ్డ డీ అడిక్షన్ సెంటర్ కు 23 మంది తరలింపు!
- లాక్ డౌన్ కారణంగా తెరచుకోని దుకాణాలు
- మతిస్థిమితం కోల్పోతున్న బాధితులు
- బస్తీ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటున్న అధికారులు
కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతుంటే, కల్లు దొరకడం లేదని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మతిస్థిమితం కోల్పోతున్న వారి సంఖ్య తెలంగాణలో నానాటికీ పెరుగుతోంది. వీరిలో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మరికొందరు ఫినాయిల్ వంటివి తాగేస్తున్నారు.
తాజాగా, రాజేంద్రనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని పలు బస్తీల్లో చాలా మంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండగా, వారిని పరిశీలించిన వైద్యాధికారులు, 23 మందిని ఎర్రగడ్డలోని డీ అడిక్షన్ సెంటర్ కు చికిత్స నిమిత్తం తరలించారు.
కల్లుకు అలవాటు పడ్డ 60 మంది తో తాము మాట్లాడామని, పలువురు తాము ఉంటున్న బస్తీ పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని రాజేంద్రనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్ చార్జి డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. బాధితుల జాబితాను తయారు చేసి, దాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.