గుంటూరు జిల్లాలో అప్రమత్తం.... 'కరోనా' వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన వారిని ఐదు అంబులెన్స్ ల్లో తరలింపు

  • గుంటూరు జిల్లాలో 4 పాజిటివ్ కేసులు
  • పలువురికి విందు ఇచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తి
  • విందుకు హాజరైన 30 మందిని గుర్తించిన అధికారులు
గుంటూరు జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన వారిపై అధికార వర్గాలు ఆరా తీశాయి. మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో 30 మందిని గుర్తించారు. వారందరినీ ఐదు అంబులెన్స్ ల్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు, ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో 23 మందిని కలిసినట్టు కూడా అధికారులు గుర్తించారు. వారిని కూడా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.


More Telugu News