వ్యవసాయ కూలీల రాకపోకలను అడ్డుకోవద్దని సీఎం జగన్ ఆదేశించారు: మంత్రి కన్నబాబు

  • వ్యవసాయ, అనుబంధ యూనిట్లకు అనుమతి
  • వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఉంటాయన్న మంత్రి
  • నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరిక
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కూలీల రాకపోకలను నిరాకరించవద్దని సీఎం ఆదేశించారని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ యూనిట్లకు అనుమతి ఉన్నట్టు వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా గిట్టుబాటు ధరలు అందించేలా చర్యలు ఉంటాయని అన్నారు.

రాష్ట్రంలో మొబైల్ మార్కెట్లు పెంచాలని సీఎం స్పష్టం చేశారని, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ ధరకు అమ్మితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా, మంత్రి ఆక్వారంగంపైనా స్పందించారు. రాష్ట్రంలో చేపలు, రొయ్యలు లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయని, ఎంపెడాతో కలిసి రొయ్యల కొనుగోలుకు నిర్ణయించిన ధరకు కొనాలని స్పష్టం చేశారు. ఆక్వా రంగంలో 50 శాతం మంది కూలీలను అనుమతించాలని, కూలీలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


More Telugu News