ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చి సాయం ప్రకటించి.. సినిమాలో తాను చేసినట్లు ఇలా చేయాలని చెప్పిన తెలుగు హీరో

  • రూ.15 ల‌క్ష‌ల విరాళం ఇస్తున్నట్లు శర్వానంద్ ప్రకటన
  • మహానుభావుడిగా ఉండాలని పిలుపు
  • అంద‌రం క‌లిసి ప‌నిచేద్దామని ట్వీట్
మొన్న చిరంజీవి, నిన్న రామ్‌ చరణ్‌.. నేడు శర్వానంద్‌ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ట్వీట్‌ ద్వారా శర్వానంద్‌ సాయాన్ని ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఫేస్‌బుక్‌లో మాత్ర‌మే పోస్టులు చేస్తోన్న శర్వానంద్‌ ఇప్పుడు ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చి..  దిన‌స‌రి కార్మికుల‌కి అండ‌గా నిలిచేందుకు రూ.15 ల‌క్ష‌ల విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు.
             కరోనా విజృంభిస్తోన్న స‌మయంలో అంద‌రం క‌లిసి ప‌నిచేద్దామని పిలుపునిచ్చాడు. క‌రోనాని ఎదుర్కొందామని, ప్ర‌భుత్వం చెబుతున్న స‌ల‌హాలు, సూచ‌నలు త‌ప్ప‌క పాటిద్దామని అన్నారు. తాను నటించిన మహాను భావుడు సినిమాలో ఓసీడీ ఉన్న పాత్రలో తాను ప్రవర్తించినట్లుగానే ఇప్పుడు ప్రజలు ప్రవర్తించాలని చెప్పాడు. ఇప్పటికే సినీ నటులు కరోనాను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.


More Telugu News