వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్న పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్!

  • ‘వ‌కీల్‌సాబ్‌’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతం పూర్తి
  • కరోనా నేపథ్యంలో షూటింగ్‌ బంద్‌
  • ఇంటి నుంచే డబ్బింగ్ చెబుతున్న పవన్
పవర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. ఆయన నటిస్తోన్న ‘వ‌కీల్‌సాబ్‌’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులు బంద్‌ అయిన నేపథ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యిన సినిమా ఎడిటింగ్ చూస్తోన్న పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో డ‌బ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను మే 15న విడుద‌ల చేస్తామని ఇప్పటికే ఆ సినిమా బృందం ప్రకటించింది. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను టాలీవుడ్‌లో పవన్  పోషిస్తున్నారు. హిందీలో తాప్సి నటించిన పాత్రలో తెలుగులో నివేదా థామస్ నటిస్తోంది.


More Telugu News