కరోనా వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు శునకాలకు శిక్షణ!
- సోకిన 14 రోజులకు బయటకు వస్తున్న కరోనా
- ముందే గుర్తించేలా శునకాలకు ట్రయినింగ్
- ఆరు వారాల్లో పూర్తవతుందని ఎండీడీ వెల్లడి
కరోనా మహమ్మారి ఎవరి శరీరంలో దాగుందో, వైరస్ సోకిన 14 రోజుల తరువాత మాత్రమే తెలుస్తున్న ఈ తరుణంలో, శునకాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా, వైరస్ ముందుగానే గుర్తించవచ్చని బ్రిటన్ కు చెందిన మెడికల్ డిటెక్షన్ డాగ్స్ (ఎండీడీ) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ దిశగా శునకాలకు ఇప్పటికే శిక్షణ ప్రారంభించామని, మరో ఆరు వారాల్లో శిక్షణ పూర్తవుతుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కారీ గెస్ట్ వెల్లడించారు.
ఆరోగ్యకరంగా కనిపిస్తున్న వ్యక్తిలో దాగున్న వైరస్ లనూ శునకాలు గుర్తించగలవని ఆమె తెలిపారు. గతంలో మలేరియాను గుర్తించేలా శునకాలకు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ (ఎల్.ఎస్.హెచ్.టి.ఎమ్) శిక్షణ ఇచ్చి విజయవంతం అయిందని తెలిపారు.