స్వీయ నిర్బంధంలో ఉంటూ బ్రిటన్ ప్రజలకు కీలక లేఖ రాసిన ప్రధాని బోరిస్ జాన్సన్
- పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయి
- మరింత కఠినతర ఆంక్షలు విధించనున్నాం
- నియమావళికి సంబంధించిన బుక్‌లెట్ పంపిణీ
బ్రిటన్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు బ్రిటన్‌లో కరోనా వల్ల 1,019 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 18 వేల మందికి వైరస్ సోకింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన తమ ప్రజలకు ఓ హెచ్చరిక చేశారు.
పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నట్లు చెప్పారు. ఈ మేరకు బ్రిటన్ ప్రజలకు ఆయన లేఖ రాశారు. మరింత కఠినతర ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. బ్రిటన్ సర్కారు విధించిన నియమావళికి సంబంధించిన బుక్‌లెట్‌ను అధికారులు ప్రతి ఇంటికి అందించే ప్రయత్నం చేస్తున్నారు.