కజకిస్థాన్ నుంచి వచ్చి చెప్పకుండా వైద్యం చేస్తున్న కనిగిరి డాక్టర్... పోలీసుల సీరియస్!

  • క్వారంటైన్ లో ఉండకుండా వైద్య సేవలు
  • పాజిటివ్ వస్తే 150 మంది, వారు కలిసిన వారంతా క్వారంటైన్ కే
  • కనిగిరి ప్రాంతంలో కలకలం రేపిన డాక్టర్
విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని, వారికి సంబంధించిన సమాచారాన్ని ఆ ప్రాంతంలోని అధికారులకు తెలియజేయాలని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా, విద్యావంతులు కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనడనికి ఇది మరో నిదర్శనం. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన డాక్టర్ విద్యాసాగర్, ఇటీవల కజకిస్థాన్ లో పర్యటించి వచ్చారు. తాను విదేశీ ప్రయాణం చేసి వచ్చానన్న విషయాన్ని అధికారులకు తెలియజేయకుండా, ప్రాక్టీస్ ను కొనసాగించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, సీరియస్ అయ్యి, ఆయనపై కేసు నమోదు చేసి, క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఆయన వద్దకు కన్సల్టింగ్ కోసం వచ్చిన వారందరి వివరాలనూ పోలీసులు సేకరిస్తున్నారు. ఓకవేళ ఆయనకు కరోనా పాజిటివ్ వస్తే, సుమారు 100 నుంచి 150 మందిని, వారు కలిసిన వారందరినీ క్వారంటైన్ చేయాల్సి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో కనిగిరి ప్రాంతంలో కలకలం రేగింది.


More Telugu News