అన్నం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్... ఉరుకులు పెట్టిన పోలీసులు!

  • చండీగఢ్ లో ఘటన
  • ఆహారం, డబ్బు లేదని పోలీసులకు ఫోన్
  • వెళ్లి ఆదుకున్న అధికారులు
తమ బిడ్డకు అనారోగ్యంగా ఉందని, మందులు కొనడానికి డబ్బులు లేవని, ఆకలి బాధను తప్పించుకోవడానికి అన్నం లేదని, ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య మినహా మరో మార్గం లేదని ఓ యువతి నుంచి ఫోన్ రావడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఈ ఘటన చండీగఢ్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తాను, తన భర్త, బిడ్డ మరణించనున్నామని, లాక్ డౌన్ కారణంగా పని లేకపోయిందని ఓ యువతి ఫోన్ చేసింది. ఆ వెంటనే ఫోన్ నంబర్ ఆధారంగా ఆ ప్రాంతానికి డీఎస్పీ దిల్ షేర్ సింగ్, ఇతర పోలీసులు వెళ్లారు. ఆ కుటుంబానికి ఆహారం, కొంత డబ్బును అందించి, బిడ్డకు వైద్యానికి ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.


More Telugu News