చికెన్‌, మటన్‌ షాపుల ముందు గుంపులు గుంపులుగా జనం

  • ఆదివారం వచ్చింది
  • ప్రజలకు చికెన్‌, మటన్‌ గుర్తుకు వస్తోంది
  • లాక్‌డౌన్‌ను లెక్క చేయకుండా కొనుగోళ్లు
  • సామాజిక దూరం పాటించని వైనం
ఆదివారం వచ్చింది.. ప్రజలకు చికెన్‌, మటన్‌ గుర్తుకు వస్తోంది. లాక్‌డౌన్‌ను లెక్క చేయకుండా, సామాజిక దూరం పాటించకుండా చికెన్‌, మటన్‌ షాపుల ముందు ప్రజలు ఎగబడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో  నాన్ వెజ్ దుకాణాల ముందు ఈ పరిస్థితి కనపడుతోంది.

ఒకరిని ఒకరు తాకుతూ, కరోనా వ్యాప్తిని లెక్క చేయకుండా వారు చికెన్‌ షాపుల వద్ద క్యూలో నిలబడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్ని రోజుల ముందు చికెన్‌ అంటేనే భయపడిపోయిన జనం.. చికెన్‌ తింటే కరోనా రాదని తెలుసుకుని మళ్లీ కొనుగోళ్లు మొదలు పెడుతున్నారు. కొన్ని దుకాణాల ముందు గుంపులు గుంపులుగా మాంసాహార ప్రియులు కనపడుతున్నారు.


More Telugu News