చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్
- కొత్తగా 45 మందికి కరోనా
- హేనన్, హుబే ప్రావిన్సుల్లో కేసులు
- మరో ఐదుగురి మృతి
- 3,300కు చేరిన మృతుల సంఖ్య
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగలేదు. కట్టుదిట్టమైన చర్యలతో ఇటీవల కొత్త కేసులు నమోదు కాని విషయం తెలిసిందే. అయితే, మళ్లీ ఆ దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్తగా 45 మందికి ఈ వైరస్ సోకింది. హేనన్, హుబే ప్రావిన్సులలో కొత్తగా 45 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో చైనా ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తమ దేశంలోని మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారని ఆ దేశ హెల్త్ కమిషన్ అధికారులు ప్రకటించారు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3,300కు చేరింది. వైరస్ విజృంభణ అధికంగా ఉన్న వుహాన్‌లో ఇటీవలే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రయాణ ఆంక్షలను సడలించారు.