ప్రేమగా బిడ్డను దగ్గరకు తీసుకోలేకపోయిన ఓ డాక్టర్ కన్నీరు... 90 లక్షల మంది చూసిన వీడియో!
- సౌదీ అరేబియాలో జరిగిన ఘటన వైరల్
- బిడ్డను తాకలేక ఓ తండ్రి కన్నీరు
- భావోద్వేగంతో స్పందిస్తున్న నెటిజన్లు
సాధారణంగా డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రిని చూస్తే, చిన్నపిల్లలు పరుగులు పెట్టి వెళ్లడం, వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆ తండ్రి వారిని లాలించడం ప్రతి ఇంట్లో నిత్యమూ కనిపించే దృశ్యమే. కానీ, ఈ వీడియో అందుకు పూర్తి విరుద్ధం. అందుకే ఇది వైరల్ అయింది. 90 లక్షల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను చూశారు.
ఈ వీడియో సౌదీ అరేబియాలో తీసినది. కరోనాపై పెద్ద యుద్ధమే చేస్తున్న ఓ వైద్యుడు, రోజంతా రోగులకు చికిత్స చేసి, డ్యూటీ ముగిసిన తరువాత వేసుకున్న మెడికల్ సూట్ తోనే ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆ డాక్టర్ కుమారుడు చెంగున దూకి, తండ్రి వద్దకు పరుగు పెట్టాడు. అయితే, ఆ తండ్రి బిడ్డను దగ్గరకు తీసుకోలేదు. "దగ్గరకు రావద్దు. దూరంగా ఉండు" అంటూ హెచ్చరించాడు. నేలపై కూలబడి, అరచేతుల్లో ముఖం పెట్టుకుని కన్నీరు పెట్టుకున్నాడు.
ఇక ఈ వీడియో నిడివి 9 సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ, అది నెట్టింట వైరల్ అయింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు చికిత్సను అందిస్తున్న వైద్యులు, తమ ఇంటికి సమయాన్ని కేటాయించలేక పోతున్నారని, వారికి కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇదని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా, ఇది తమ మనసును తాకిందని, వీడియో చూసి ఏడుపు వచ్చిందని భావోద్వేగ కామెంట్లు పెడుతున్నారు.