ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడి వలస కూలీల బాగోగులను పట్టించుకోవాలి : సీపీఐ రామకృష్ణ

  • ఆదుకుంటామని చెప్పి మాటతప్పిన సర్కారు 
  • వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది 
  • తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్

రాష్ట్రానికి చెందిన పలువురు కూలీలు ముంబయి, హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో చిక్కుకుని లాక్ డౌన్ కారణంగా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారని, కానీ వారి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఉన్నచోట ఆహారం, వసతి సౌకర్యం లేదని, సొంతూర్లకు వచ్చేద్దామంటే రవాణా సౌకర్యం లేదని, దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. వలస కూలీలను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇన్ని రోజులైనా వారి విషయాన్నే విస్మరించిందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడి వలస కూలీల బాగోగులను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. వారికి ఆహారం, భద్రత, వైద్యసౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, రాష్ట్రంలోని వేర్వేరు పాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు తమ సొంతూర్లకు వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.



More Telugu News