పనిలేకుండా రోడ్లపైకి వస్తే... అనుమానిత రోగుల సేవ నిమిత్తం పంపిస్తున్న రాజస్థాన్ అధికారులు!

  • రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొడుతున్న ఆకతాయిలు
  • అరెస్ట్, కొట్టడాలు వద్దని నిర్ణయించుకున్న పోలీసులు
  • రోగలకు సేవ చేసేందుకు తరలింపు
దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఉత్తర్వులు అమలవుతున్న వేళ, ఆకతాయిలు, ఏ విధమైన పని లేకుండా, రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొడుతుంటే, వారిని పట్టుకున్న రాజస్థాన్‌ అధికారులు వినూత్న శిక్ష విధిస్తున్నారు. వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉన్న అనుమానిత రోగుల సేవ నిమిత్తం పంపుతున్నారు. ఏ పనీ లేకుండా రోడ్లపైకి వస్తున్న వారిని అరెస్టు చేయడం, లేదా లాఠీలతో కొట్టడం చేయకూడదని నిర్ణయించుకున్నామని, వారిని తీసుకెళ్లి, జేజేటీ వర్సిటీ, సింఘానియా వర్సిటీల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. వారితో రోగులకు సేవ చేయిస్తున్నామని తెలిపారు.

వాస్తవానికి ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్ని గమనించిన పోలీసులు, ఉల్లంఘనులను పట్టుకుని, వారి ద్వారా రోగులకు సేవలు చేస్తున్నారు. ఇక, రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిలను గుర్తిస్తే, వారి ఫోటోలను పంపించాలని సోషల్ మీడియాలో పోలీసు అధికారులు సందేశాలు పెడుతూ ఉండటం విశేషం.


More Telugu News