వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్న లాక్‌డౌన్.. పెరుగుతున్న కొత్త కేసులు
- వారంలో మూడింతలు పెరిగిన కరోనా కేసుల సంఖ్య
- శనివారం ఉదయం నుంచి సాయంత్రం మధ్య కొత్తగా 194 కేసులు
- కరోనా వ్యాక్సిన్లను జంతువులపై ప్రయోగిస్తున్నామన్న ఐసీఎంఆర్
దేశంలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నప్పటికీ కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. వైరస్ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. శనివారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:45 గంటల మధ్య 194 కొత్త కేసులు నమోదు కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అంటే, వారం రోజుల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య మూడింతలు పెరగింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా వైద్యులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వైరస్ తీవ్రంగా వున్న ప్రాంతాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. ఐసీఎంఆర్ సీనియర్ అధికారి రామన్ గంగాఖేడ్కర్ మాట్లాడుతూ.. జంతువులపై కొన్ని వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నట్టు తెలిపారు.