భారీ ఎత్తున వెంటిలేటర్లు, మాస్క్ ల తయారీలోకి దిగిన మారుతి సుజుకి
- అగ్వా హెల్త్ కేర్ తో ఒప్పందం
- టెక్నాలజీ ఆగ్వాది, నిధులు మారుతి సుజుకివి
- నెలకు 10 వేల యూనిట్లు వెంటిలేటర్ల తయారీ లక్ష్యం
భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు మాస్క్ లను, వెంటిలేటర్ల తయారీ రంగంలోని దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ప్రవేశించింది. ఇందుకోసం అగ్వా హెల్త్ కేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆ కంపెనీతో కలిసి నెలకు 10,000 యూనిట్ల వెంటిలేటర్లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని పేర్కొంది.
తాము తయారు చేసే వెంటిలేటర్స్ కు తగిన టెక్నాలజీని అగ్వా హెల్త్ కేర్ అందిస్తుందని, వెంటిలేటర్స్ తయారీకి కావాల్సిన నగదు, ప్రభుత్వ పరమైన అనుమతులకు అయ్యే ఖర్చులను తాము భరించనున్నామని మారుతి సుజుకి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవగాహనా ఒప్పందంలో భాగంగా, మూడు పొరల మాస్క్‌లను తయారు చేసి హరియాణ, కేంద్ర ప్రభుత్వాలకు సరఫరా చేయనున్నామని, భారత్ సీట్స్ లిమిటెడ్ తో కలిసి వైరస్ నుంచి శరీరానికి రక్షణ కల్పించే క్లాత్ ను కూడా తయారు చేయనున్నామని వెల్లడించింది.