బుధవారం నుంచి అమలులోకి రానున్న బ్యాంకుల మెగా విలీనం!
- నాలుగు మెగా బ్యాంకులుగా మారనున్న 10 పీఎస్యూలు
- నోటిఫై చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఏప్రిల్ 1 నుంచి విలీనం అమలు
10 ప్రభుత్వ రంగ బ్యాంకులు నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం కాగా, ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. విలీన బ్యాంకుల శాఖలు, విలీనం చెందిన బ్యాంకుల శాఖలుగా ఇకపై పని చేస్తాయని ఆర్బీఐ పేర్కొంది. కాగా, ఈ నెల 4న బ్యాంకుల విలీనంపై నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేయాలని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు, ఈ నెలారంభంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినా, విలీన ప్రక్రియ సరైన దిశలోనే సాగుతున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో ముందుగా అనుకున్నట్టుగానే 1 నుంచి విలీనం అమల్లోకి రానుంది.