దేశంలో ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టులు చాలా తక్కువ: జేపీ

  • ఇకనైనా విరివిగా టెస్టులు చేయాలని సూచన
  • లాక్ డౌన్ ను మరికొంతకాలం పొడిగించాలన్న జేపీ
  • వలసకూలీలను వారి స్వస్థలాలకు పంపించాలని వినతి
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ దేశంలో తాజా పరిస్థితులపై స్పందించారు. దేశంలో ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టులు చాలా తక్కువ అని జేపీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కరోనా టెస్టులు విరివిగా చేయాలని అన్నారు.

కష్టమైనా, నష్టమైనా లాక్ డౌన్ ను మరికొన్నిరోజుల పాటు పొడిగించాలని సూచించారు. ముఖ్యంగా, వలసకూలీలను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందనేది అవాస్తవం అని జేపీ స్పష్టం చేశారు. మిడిమిడి జ్ఞానంతో క్లోరోక్విన్ మాత్రలు వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని హితవు పలికారు.


More Telugu News