ప్రధాని ఫోన్ కాల్ తో ఉక్కిరిబిక్కిరైన పూణే నర్సు!
- నాయుడు ఆసుపత్రి నర్సు ఛాయా జగతాప్ కు మోదీ ఫోన్
- నర్సు యోగక్షేమాలు అడిగిన ప్రధాని
- ప్రధానితో స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన నర్సు
పూణే నగరంలోని నాయుడు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఛాయ జగతాప్ అనే నర్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్యరీతిలో ఫోన్ కాల్ చేశారు. దాంతో ఆ నర్సు ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ప్రధాని అంతటివాడు తనకు నేరుగా ఫోన్ చేయడంతో ఉక్కిరిబిక్కిరైంది.
మరాఠీలో మొదలుపెట్టిన మోదీ, తొలుత నర్సు యోగక్షేమాలను అడిగారు. రోగులకు సేవ చేసే సమయంలో కుటుంబం గురించి ఏం ఆలోచిస్తారు? అంటూ ప్రశ్నించారు. అందుకా నర్సు బదులిస్తూ, కుటుంబం పట్ల కూడా ఆందోళన ఉండడం సహజమే అయినా, రోగులకు సేవ చేయడం తమ విధి అని, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో సేవలు అందించడాన్ని విద్యుక్త ధర్మంగా భావిస్తామని తెలిపింది.
అంతేకాదు, కరోనా మహమ్మారిపై స్ఫూర్తి కలిగించే ఆమె మాటలను ప్రధాని మోదీ ప్రశంసించారు. "ఎవ్వరూ భయపడవద్దు, మనం ఈ మహమ్మారిని కచ్చితంగా తరిమేస్తాం. కరోనాపై భారత్ తప్పక గెలుస్తుంది. దేశంలోని ప్రతి ఆసుపత్రి, వైద్య సిబ్బంది అందరికి ఇదే లక్ష్యం కావాలి" అంటూ ఛాయా జగతాప్ ధీమాగా చెప్పడాన్ని మోదీ హర్షించారు.