నిత్యావసరాలు కొనుగోలు చేసే సమయం తగ్గించాలన్న సూచనపై సీఎం జగన్ స్పందన
- కొనుగోళ్లు జరిపే సమయం తగ్గించాలన్న మంత్రులు
- సమయం తగ్గిస్తే ఒక్కసారిగా రద్దీ పెరుగుతుందన్న సీఎం
- సమూహాలు ఏర్పడేందుకు తామే అవకాశం ఇచ్చినట్టువుతుందని వెల్లడి
ఏపీలో కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. అయితే, ఈ సమయాన్ని తగ్గించాలని కొందరు మంత్రులు సీఎం జగన్ కు తెలుపగా, ఆయన దీనిపై స్పందించారు.
సమయాన్ని తగ్గిస్తే ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చే అవకాశముందని, తద్వారా జనసమూహాలు ఏర్పడేందుకు తామే అవకాశం ఇచ్చినట్టు అవుతుందని సీఎం మంత్రులకు వివరించారు. ఈ సూచనను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయాలని ఆయన మంత్రులకు సూచించారు. ప్రజల వద్దకే మొబైల్ రైతు బజార్లు, మొబైల్ నిత్యావసరాల దుకాణాలను తీసుకెళ్లగలం అన్న ధీమా ఉన్నప్పుడే సమయం తగ్గించే ఆలోచన చేద్దామని సీఎం స్పష్టం చేశారు.
క్యాబినెట్ సమావేశం అనంతరం ఏపీ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఏపీ విద్యార్థులు, ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తామని, తమతో సహకరించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా, వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.