క్వారంటైన్ కు  సిద్ధంగా ఉంటేనే ఏపీలోకి రండి: జగన్

  • 14 రోజులు క్వారంటైన్ కు సిద్ధపడేవారిని ఏపీలోకి అనుమతించండి
  • స్వచ్ఛందంగా వచ్చే వైద్యుల సేవలను  ఉపయోగించుకోవాలి
  • విదేశాల నుంచి వచ్చే ప్రతి 10 మందికి ఒక డాక్టర్ ను కేటాయించాలి
కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో వసతులు, భోజనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 14 రోజులు క్వారంటైన్ కు సిద్ధ పడేవారికి ఏపీలోకి అనుమతినివ్వాలని చెప్పారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై జగన్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలకు తగ్గట్టుగా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలను అందుబాటులోకి తీసుకురావాలని... ఆ తర్వాత వాటి కొనుగోలు సమయాన్ని తగ్గించాలని చెప్పారు.
 
కరోనా బాధితుల చికిత్స కోసం స్వచ్ఛందంగా వచ్చే  వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని జగన్ సూచించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి 10 మందికి ఒక డాక్టర్ ను కేటాయించాలని చెప్పారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఐసొలేషన్ లో పెట్టాలని ఆదేశించారు.


More Telugu News