'ఎర్రబస్సు' నా కెరియర్ ను పెద్ద దెబ్బ కొట్టింది: మంచు విష్ణు
- నాన్నకి లైఫ్ ఇచ్చిందే దాసరి గారు
- 'ఎర్రబస్సు'లో చేయమనగానే ఓకే అనేశాను
- ఆ సినిమా నా కెరియర్ ను దెబ్బకొట్టిందన్న విష్ణు
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ, 'ఎర్రబస్సు' సినిమాను గురించి ప్రస్తావించాడు. "ఓ రోజున దాసరిగారు పిలిచి 'ఎర్ర బస్సు' సినిమాలో చేయమన్నారు. నాకు కథ తెలియదు .. నేను అడగలేదు .. ఒక్క ప్రశ్న కూడా వేయలేదు .. ఓకే అంకుల్ అన్నాను.
నటుడిగా మా నాన్నకి జీవితాన్నిచ్చింది దాసరి గారే. కెరియర్ ఆరంభంలో నాన్నను ఎంకరేజ్ చేసిందే ఆయన. అలాంటి ఆయన ఇప్పుడు తన సినిమాలో చేయమని అడిగినప్పుడు, చేయాలా వద్దా అని నేను లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మానవత్వానికి అర్థం లేకుండా పోతుంది. అందుకే పూర్తి విశ్వాసంతో ఆ సినిమా చేయడానికి అంగీకరించాను. నా కెరియర్ కి అది పెద్ద దెబ్బే కొట్టింది. అయినా నేను నిలదొక్కుకోగలను అనే నమ్మకంతో ఆ సినిమా చేశాను. దాసరిగారి వంటి ఒక మహా దర్శకుడి సినిమాలో చేశాననే సంతృప్తి నాకు ఎప్పటికీ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.