జూన్ లో సెట్స్ పైకి 'టక్ జగదీశ్'

  • 'నిన్ను కోరి'తో హిట్ కొట్టిన శివ నిర్వాణ
  • నానితో మరో సినిమాగా 'టక్ జగదీశ్'
  • జూన్ 6వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్  
'నిన్ను కోరి' సినిమాతో నానికి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ, నానీతో మరో సినిమాను ప్లాన్ చేశాడు. 'టక్ జగదీశ్' పేరుతో ఈ సినిమా రూపొందనుంది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూన్ 6వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు.

ఈ సినిమాలో నాని చాలా స్టైలీష్ లుక్ తో డిఫరెంట్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన సరసన నాయికలుగా రీతూ వర్మ .. ఐశ్వర్య రాజేశ్ అలరించనున్నారు. ఇటీవల సరైన పాత్రలో జగపతిబాబు కనిపించలేదు. మళ్లీ ఆయన గురించి మాట్లాడుకునేలా ఈ సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్రను చేస్తున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. శివ నిర్వాణ - నాని కలిసి ఈ సారి కూడా హిట్ కొడతారేమో చూడాలి.


More Telugu News