సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: సీపీఐ నారాయణ
- కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందన్న విశ్వాసం కల్పించారు
- ప్రస్తుత పరిస్థితి ప్రైవేటు ల్యాబ్ లకు వరంగా మారకుండా జాగ్రత్త పడ్డారు
- వైద్య, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు పోలీసులకు కృతజ్ఞతలు
కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ వాసులపైనా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సమస్యలపైనా ఆలస్యంగా నైనా సరే దృష్టి పెట్టినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీపీఐ నారాయణ అన్నారు. కష్ట కాలంలో ప్రజలకు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పట్టణ ప్రాంతాల్లో పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న విశ్వాసాన్ని కేసీఆర్ కల్పించారని, ప్రస్తుత పరిస్థితులు ప్రైవేటు ల్యాబ్ ల పాలిట వరంగా మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. గాంధీ ఆసుపత్రి తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులను జిల్లా స్థాయి వరకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ‘కరోనా’ మహమ్మారిపై పోరాడుతున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర వ్యాఖ్య ఆయన చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లల్లో ఉంటున్న వారి కోసం టీవీలో తమ కార్యక్రమాల ద్వారా ప్రజానీకానికి ఎంటైర్ టెయిన్ మెంట్ అందిస్తున్న కళాకారులకు, ముఖ్యంగా సుమకు తన కళాభివందనాలు తెలుపుతున్నానని అన్నారు.