బ్రిటన్ ఆరోగ్యమంత్రినీ వదలని కరోనా మహమ్మారి
- బ్రిటన్ ఆరోగ్యమంత్రి హేంకాక్ కు కరోనా పాజిటివ్
- స్వల్ప అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న హేంకాక్
- ఇప్పటికే కరోనా బారినపడిన బ్రిటన్ యువరాజు, ప్రధాని
కరోనా వైరస్ భూతం బ్రిటన్ లో ప్రముఖులను సైతం వదలడంలేదు. ఇప్పటికే యువరాజు చార్లెస్, ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారినపడ్డారు. తాజాగా ఈ జాబితాలో బ్రిటన్ ఆరోగ్యమంత్రి మాట్ హేంకాక్ కూడా చేరారు. వైద్యుల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఆ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని హేంకాక్ ట్విట్టర్ లో వెల్లడించారు. అదృష్టవశాత్తు తీవ్ర లక్షణాలేవీ లేవని, దాంతో స్వీయనిర్బంధంలో ఉంటూ ఇంటి నుంచే పనిచేస్తున్నానని తెలిపారు. ఇంట్లోనే ఉండడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.