'జానకి దాది' అస్తమయం పట్ల సీఎం జగన్ సంతాపం

'జానకి దాది' అస్తమయం పట్ల సీఎం జగన్ సంతాపం
  • సమాజం కోసం, మహిళా సాధికారిత కోసం ఆమె పాటుపడ్డారు
  • ఆధ్యాత్మికంగా తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లారు
  • ఎంతో మంది శిష్యులను తయారు చేశారు
ప్రజాపిత బ్రహ్మకుమారి ముఖ్య సంచాలిక జానకి దాది అస్తమయం పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం తెలిపారు. సమాజం కోసం, మహిళా సాధికారిత కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు. ఆధ్యాత్మికంగా తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లిన ఆమె, ఎంతో మంది శిష్యులను తయారు చేశారని అన్నారు. కాగా,  గత కొన్ని రోజులుగా ఉదర, శ్వాస సంబంధ సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. రాజస్థాన్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె కన్నుమూశారు.


More Telugu News