స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ డౌన్.. నిఫ్టీ అప్

  • 131 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 19 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతం వరకు పెరిగిన యాక్సిస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు... ఆ తర్వాత కీలక రేట్లను తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో నష్టాల్లోకి జారుకుంది. ఈరోజు  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 131 పాయింట్లు నష్టపోయి 29,816కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 8,660కి పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (4.98%), ఐటీసీ (3.63%), ఎన్టీపీసీ (3.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.66%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.44%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-8.87%), హీరో మోటో కార్ప్ (-8.04%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.94%), భారతి ఎయిర్ టెల్ (-5.89%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-4.37%).


More Telugu News