హోం క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన విజయవాడ యువకుడిపై కేసు
- ఈ నెల 16న అమెరికా నుంచి వచ్చిన యువకుడు
- హోం క్వారంటైన్ లో ఉండాలంటూ చేతికి ట్యాగ్ వేసిన వైద్యులు
- రెండు రోజుల క్రితం బయటకు వచ్చి తిరుగుతున్న వైనం
ప్రపంచ మహమ్మారి కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ... కొందరు చదువుకున్న మేధావులు మాత్రం వాటికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. కనీస బాధ్యతను కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలో తాజాగా చోటు చేసుకుంది.
ఈ నెల 16న అమెరికాలోని డల్లాస్ నుంచి ఒక యువకుడు విజయవాడకు వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తూ... చేతికి ట్యాగ్ వేశారు. అయితే, ఇవేవీ పట్టించుకోని అతగాడు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మచిలీపట్నం, పెదపారుపూడి మండలం భూషణగుల్లలోని తన బంధువుల ఇళ్లకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.