మోదీ, నిర్మలా సీతారామన్, శక్తి కాంత్ దాస్ లకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

  • ఆర్‌బీఐ మారటోరియం ప్రకటనపై పవన్ మరోమారు స్పందన
  • సంక్షోభ సమయంలో ప్రజలకు ఈఎంఐలపై  ఉపశమనం
  • ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్బీఐ గవర్నర్ కు ధన్యవాదాలు
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్నిరకాల రుణాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్‌బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే హర్షం వ్యక్తం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోమారు స్పందించారు. సంక్షోభంలో ప్రజలకు ఈఎంఐలపై  ఉపశమనం ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి,  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, ఆర్‌బిఐకి గవర్నర్ శక్తి కాంత్ దాస్ కు ధన్యవాదాలు తెలిపారు.


More Telugu News