కరోనా భూతంపై పోరుకు సచిన్ టెండూల్కర్ విరాళం
- దేశంలో కరోనా విస్తృతి
- పీఎం రిలీఫ్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు సచిన్ విరాళం
- రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా మహమ్మారిపై పోరాటానికి తన వంతు విరాళం ప్రకటించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే దేశంలోని ప్రముఖులు సామాజిక బాధ్యతతో స్పందిస్తూ భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమకు తోచినంత మొత్తాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సచిన్ కూడా చేరాడు. కాగా, భారత్ లో కరోనా కేసుల పెరుగుదల నిష్పత్తి ఆందోళనకరంగా ఏమీ లేకున్నా, వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మున్ముందు కూడా కఠినంగానే వ్యవహరించాలని కేంద్రం భావిస్తోంది.