ఇల్లు ఊడుస్తున్నా.. వంట చేస్తున్నా: కపిల్ దేవ్
- మీరంతా ఇళ్లలోనే ఉండి ప్రభుత్వానికి సహకరించండి
- మనమంతా ఏకమైతే కరోనాపై యుద్ధంలో గెలుస్తాం
- ప్రజలకు భారత క్రికెట్ దిగ్గజం సూచన
లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విజ్ఞప్తి చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరికీ ఇదే జీవనరేఖ అని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు కపిల్ మద్దతు తెలిపాడు.
తానెప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటానన్న కపిల్..ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా ఒక్కటైతే కరోనాపై యుద్ధంలో గెలుస్తామన్న ఆశాభావం ఉందన్నాడు. అది జరగాలంటే ప్రజలంతా ప్రభుత్వం చెప్పినట్టు వినాలన్నాడు. ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి, వైద్యులకు బలం చేకూర్చాలని కోరాడు.
‘ఇప్పుడు మీరంతా ఇళ్లలోనే ఉండాలి. దయచేసి ఆ పని చేయండి. ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతున్న వారికి, ఆయా సంస్థలకు సాయం చేసిన వారవుతారు. దీన్ని సానుకూల దృక్పథంతో కూడా స్వీకరించొచ్చు. దీన్ని లాక్‌డౌన్ అనే కాదు ఇంట్లో ఉండడం కూడా అనుకోవచ్చు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీకు మీరే సవాల్ విసురుకోండి. మీరేం ఒంటరిగా లేరు. మీ ఇంట్లో మీ ప్రపంచమే ఉంది. అదే మీ కుటుంబం. మిమ్మల్ని ఆహ్లాదపరిచేందుకు పుస్తకాలు, టీవీ, మ్యూజిక్ ఉండనే ఉన్నాయి. అన్నిటి కంటే ఉత్తమమైన మార్గం ఏమిటంటే మీ కుటుంబ సభ్యులతో హాయిగా మాట్లాడొచ్చు’ అని కపిల్ చెప్పుకొచ్చాడు.