సామాజిక దూరం పాటిస్తూ ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న జగన్
- కాన్ఫరెన్స్ హాలులో భేటీ
- కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు
- రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను ఆమోదించనున్న మంత్రివర్గం
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. జగన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశంలో చర్చలు జరుపుతున్నారు. కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో జగన్ చర్చిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అందించాల్సిన సేవలపై చర్చిస్తారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను ఆమోదించనున్నారు.