అలాగైతే సమస్య కన్నా పరిష్కారమే జటిలమవుతుంది: ఐవైఆర్‌ కృష్ణారావు

  • హైదరాబాద్‌ నుంచి వస్తోన్న వారిని  ఏపీలో అడ్డుకుంటున్నారని విమర్శలు
  • విశాఖ నుంచి వస్తే పర్వాలేదట
  • కానీ హైదరాబాద్ నుంచి రావటం కుదరదు అంటున్నారు
  • ఇది కృత్రిమ నిబంధనే అవుతుంది 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడు వారాల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి వస్తోన్న ఏపీ వ్యక్తులను సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై సాయం చేయాలంటూ కొందరు తనకు ఫోన్లు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.  

'మీరు ఏమైనా సహాయం చేయగలరా? ఈరోజు ఒక తెలియని వ్యక్తి ఫోను. విశాఖ నుంచి వస్తే పర్వాలేదు కానీ హైదరాబాద్ నుంచి రావటం కుదరదు అనడం కృత్రిమ నిబంధనే అవుతుంది. నిబంధనలు చాలా అవసరమైన సమయ సందర్భాలను బట్టి పట్టు విడుపులు లేకపోతే సమస్య కన్నా పరిష్కారమే జటిలమవుతుంది' అని ఆయన అన్నారు.
 
'ఒక్క తడవ మినహాయింపుగా హైదరాబాద్ నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లే వాళ్లను అనుమతించి పూర్తి వివరాలు తీసుకొని మానిటర్ చేయడమే అసలు అనుమతించం అనడం కన్నా మెరుగైన పరిష్కారం' అని ఆయన ట్విట్టర్‌లో సూచించారు.


More Telugu News