హెచ్చరిక.. పొగతాగేవారికి కరోనా ముప్పు అధికం!
- పొగతాగేవారిలో కరోనా వచ్చే అవకాశం 14 శాతం ఎక్కువ
- చైనాలో వేలాదిమంది రోగులపై జరిపిన పరిశోధనలో వెల్లడి
- ఒకే సిగరెట్‌ను పంచుకుని తాగడం వల్ల కూడా సోకే ప్రమాదం
పొగతాగే వారికి ఇది హెచ్చరికే. ప్రస్తుతం ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్.. పొగతాగేవారిపై మరింత పగబడుతుందని చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలింది. మిగతా వారితో పోలిస్తే ధూమపానం చేసేవారిలో వైరస్ సోకే అవకాశం 14 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో కరోనా సోకిన వేలాదిమందిపై జరిపిన పరిశోధన అనంతరం వీరు ఈ విషయాన్ని వెల్లడించారు.
పొగతాగే వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల వారిలో వైరస్ వ్యాపించే అవకాశాలు మిగతావారితో పోలిస్తే చాలా ఎక్కువని పరిశోధనకారులు తెలిపారు. మామూలుగా శుభ్రత కోసం ఊపిరితిత్తులు మ్యూకస్ పొరను ఉత్పత్తి చేస్తాయని, అయితే, పొగతాగేవారిలో ఈ మ్యూకస్ పొర మందంగా ఉండడంతో వ్యర్థాలను బయటికి పంపేందుకు ఊపిరితిత్తులు చాలా కష్టపడతాయని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దక్కన్ బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు.
ఒకే సిగరెట్‌ను పలువురు పంచుకుని తాగడం వల్ల కరోనా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని టాటా మెమోరియల్ ట్రస్ట్ క్యాన్సర్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ చతుర్వేది హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తులైన గుట్కా, జర్దాలను తిని రోడ్లపై ఉమ్మడం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాపిస్తోందని వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి భావన ముఖోపాధ్యాయ ఆందోళన వ్యక్తం చేశారు.