నేటి సాయంత్రం 'నమో జ్యోతి'... బీజేపీ పిలుపు!

  • భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
  • రెండు దీపాలు వెలిగించి కృతజ్ఞతలు చెబుదాం
  • తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం, సామాన్యుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని, వారి కోసం భారీ ప్యాకేజీని ప్రకటించినందుకు కృతజ్ఞతగా నేడు 'నమో జ్యోతి' కార్యక్రమాన్ని చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నేటి రాత్రి 7 గంటలకు, ప్రతి ఒక్కరూ రెండు దీపాలు వెలిగించి బీజేపీకి, నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.

ఇండియాలోని వారిలో 99 శాతం పేద, మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలేనని, వారికి ప్రయోజనాన్ని చేకూర్చేలా ప్యాకేజీని ప్రవేశపెట్టినందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన అన్నారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తా కనీసం ఐదుగురు పేదవారికి భోజనం అందించాలని ఆయన అన్నారు. ఈ మేరకు టెలీ కాన్ఫరెన్స్ లో కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, ఓ సైనికుడిలా ప్రతి ఒక్కరూ కరోనాపై యుద్ధం చేయాలని కోరారు.


More Telugu News