మరో మూడు కోట్ల సాయం ప్రకటించిన ప్రభాస్!
- ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు
- మొత్తంగా నాలుగు కోట్లు ప్రకటించిన ప్రభాస్
- వెల్లువెత్తుతున్న విరాళాలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ తాజాగా ప్రధానమంత్రి సహాయనిధికి మూడు కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. దీంతో అతడు ప్రకటించిన విరాళం మొత్తం నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి.
లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నితిన్, త్రివిక్రమ్, దిల్‌రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి వారు తమ వంతు సాయం ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ రెండుసార్లు సాయం ప్రకటించడం గమనార్హం.