కరోనా కట్టడికి... సినీ నిర్మాత దిల్ రాజు విరాళం
- ‘కరోనా’ కట్టడికి పెరుగుతున్న విరాళాలు
- రెండు రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళం
- దిల్ రాజు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడి
కరోనా వైరస్ కట్టడికి విరాళాలు ఇస్తున్న వారి జాబితా క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా, ఆ జాబితాలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చేరారు. ఏపీ, తెలంగాణలలో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్టు దిల్ రాజు సొంత చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.