కరోనా సహాయక చర్యలకు ఎంపీ లాడ్స్ నుంచి రూ.4.5 కోట్లు కేటాయించిన సీఎం రమేశ్

  • పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు
  • తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి చొప్పున కేటాయింపు
  • కడప జిల్లా కలెక్టరేట్ కు రూ.50 లక్షలు
కరోనా సహాయక చర్యల కోసం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ భారీగా నిధులు కేటాయించారు. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.4.5 కోట్లు అందించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు కేటాయించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.1 కోటి చొప్పున అందించనున్నారు. కడప జిల్లా కలెక్టరేట్ కు రూ.50 లక్షలు ప్రకటించారు. కరోనాపై పోరులో ఎంపీలు అవినాశ్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తమ ఎంపీ లాడ్స్ నిధుల నుంచి భారీగా కేటాయించారు. అవినాశ్ రెడ్డి పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు కేటాయించగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.1.65 కోట్లు కేటాయించారు.


More Telugu News