స్వీడన్ నుంచి విజయవాడ వచ్చిన యువకుడికి కరోనా

  • రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు
  • ఏపీలో 11కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
  • ప్రత్యేక బులెటిన్ లో వెల్లడించిన ఏపీ ఆరోగ్య మంత్రిత్వశాఖ
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తాజాగా, స్వీడన్ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. దాంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 11కి చేరింది. దీనిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. మరో 29 మంది శాంపిల్స్ ను పరీక్ష కేంద్రాలకు పంపినట్టు వెల్లడించింది. అటు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కి పెరిగింది. ఇవాళ కూడా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


More Telugu News